Pages

Sunday 12 June 2011

తెలంగాణ మంత్రి నిజరూపం

జాతీయవాదం ఉన్నతమైంది. రాష్ట్రీయవాదం మహొన్నతమైంది. పాపం తెలంగాణవాదమే సచ్చుపడింది.

Wednesday 13 April 2011

వాళ్లు..

పువ్వు మకరంద విలువ తెలియని వాళ్లు.. పూలతో వ్యాపారం అసలే తెలియని వాళ్లు వాళ్లు.మిద్దె అంటే తెలియని వాళ్లు మిద్దెలోల్లకు ఆనందం కలిగించే మిద్దెలను నిర్మించారు వాళ్లు. నేడు బలిసినోళ్లు ఇంకా బలిసేందికు నిర్మిస్తున్న  పోలవరం బాదితిలు వాళ్లు.

Monday 28 March 2011

రాజవివేకం ఓ దొంగలముఠ !!!



చట్టసభ కొందరికే చుట్టం
నాడు
తెలంగాణ తమ్ముడు
లక్ష్మణ్ చేసిందేమీ..?
నేడు
రాజావారి తమ్ముడు లక్ష్మణుడు
చేసిన ఘనకార్యమేమి..???
ఒకరికి చట్టం అమలైంది
మరొకరికి చుట్టమైంది.
ఆంద్రా అసెంబ్లీలో
అంతా రాజావారి దొంగలముఠనే 

Sunday 27 March 2011

ఓ వేట కొడవలీ నీ చిరునామా ఎక్కడా?

ఉద్యమ స్పూర్తి
నేల కొరిగింది...
నేల రాల్చిన
ఓ వేట కొడవలీ
నీ పుట్టుక...
నీ చిరునామా ఎక్కడా?
సాగనంపిన రాజ్యమా
స్పూర్తిని హతమార్చగలవా ?????

Wednesday 23 March 2011

మా కుక్క దీక్ష

మా ఇంట్లో ఆరు వందల మంది ఆత్మబలిదానం చేసుకున్నప్పుడు నోరు తెరవని మా కుక్క నేడు  దీక్షకు దిగింది. మా పెంపుడు కుక్క నా మీద అలిగింది. నాలుగు రాజకీయ డిమాండ్లతో నాలుగు రోజులు దీక్షకు దిగింది. కారణాలు సహేతుకమే. కానీ నాబాధ అంతా దాని దీక్ష తీరుమీదే.... ఏమీ ముట్టలేదు. అందరితో నాకు అదే రాయబారం పంపింది. సరే ఎప్పటికన్నా ఉపయోగపడదా అని దాని డిమాండ్లు అంగీకరించా. అదేందో... అది దీక్షకు దిగిన కాడి నుండి బుల్లితెరలు తెగ హైరానా పడ్డాయి. బ్రహ్మాండం బద్దలైనట్లు. చివరికి డిమాండ్లు ఒప్పుకోగానే బుల్లితెరల మైకులముందు గంట నిలబడి నీతులు పలికింది. ఆశ్చర్యం అన్ని రోజులు దీక్ష చేసినా ఆరోగ్యం బ్రహ్మాండం. మా కుక్క రఘు నికార్సైనది. 

Sunday 20 March 2011

ఓటుకు ఉరి



ఓటు
అంతా రహస్యం
ప్రజాస్వామ్య మనుగడకు
అదే అమృతం
సామాన్య ఓటర్
సిగ్గుపడేలా
ఓటుకు
ఉరి వేశారు....
ఎవడికి ఎవడు వేశాడో
అంతా బజారునపడ్డది
ఇదీ మన దుస్ఠితి
సిగ్గికు సిగ్గేస్తుంది
(ఎమ్మెల్సీ ఎన్న్రికల్లో ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా "ఓటు"కు మన నాయకులు ఉరివేశారు.)

Saturday 19 March 2011

జొన్నవిత్తులా...!



ఎప్పుడు తెలుస్తుందిరా మీకు?
బతుకంటే బిజినెస్ కాదని..
బతుకంటే పోరాటమని..
పోరాటమంటే మెతుకు కోసం ఆరాటమనీ...
జీవితాలు కాలిపోతుంటే దిక్కులేదు గానీ..
విగ్రహాలు కూలిపోతే అంత మంటా నీకు...
బతుకులు మంటల్లో కలిసిపోతుంటే బాధలేదు..
మెతుకులు లేక అవస్థ పడుతుంటే జాలి లేదు..
విగ్రహాలు పోయాయని విలవిల్లాడుతున్నావే...
వెయ్యి బొమ్మలు మళ్లీ నిలబెడతా..
పోయిన ఒక్క ప్రాణం తీసుకురా...
పైత్యపు కవిత్వం కాదురా పోరాటమంటే..
సత్యం కోసం జరిగేదేరా పోరాటం

ఇప్పుడే స్పష్టత వచ్చింది....!


ఇప్పుడు స్పష్టత వచ్చింది
ఎవరి వారు ఎవరో
ఇన్నాళ్లూ దొంగచాటుగా ఉన్నారు
నేడు
వారి స్వబుల్లి తెరలపై నృత్యం చేస్తున్నారు
అడుగడుగునా పోలీస్‌ పహారాను ప్రశ్నించనివాడు
గురివిందల అరవిందలై
ఇంకెంతకాలం వలెవేస్తారు
శ్రీరంగపు నీతులు
ఇన్నాళ్లూ మనందరి వారన్నారు
నేడు మావారంటున్నారు
నీ పాట, నాపాట
నీ బాష, నా యాస
నీ పద్యం, నా గద్యం
మొత్తంగా నీ, నా స్మృతులు వేరైనప్పుడు
నా వైతాళికులకు లేనిచోటు
నీ వారికే ఉంటే
నా హృదయం ద్రవించదా?
ఇక....
నీ నాటకం బయటపడింది
అరవై వసంతాల ఆక్రోషం
ఆరువందల ఆత్మబలిదానాలకు
వేదనతో గాయపడ్డ మా మనుసులకు
గైవించని చోట
మమ్ములను విధ్వంసం చేసిన చోట
నిన్నెలా భుజాన ఎత్తుకోను?
కూల్చిన రాతి బొమ్మలకే
ఎందుకంత రాద్ధాంతం
మా పిల్లల భవిష్యత్తును నేలరాల్చిన
మీ పరాయి పాలనపై
పెదవి విప్పరేమి
ఇప్పుడే నిజాలు బయటపడ్డాయి
మాకూ
స్పష్టత వచ్చింది
ఎవరివారు ఎవరో
ఇక ధూం ధామే....