Monday, 28 March 2011
Sunday, 27 March 2011
Wednesday, 23 March 2011
మా కుక్క దీక్ష
మా ఇంట్లో ఆరు వందల మంది ఆత్మబలిదానం చేసుకున్నప్పుడు నోరు తెరవని మా కుక్క నేడు దీక్షకు దిగింది. మా పెంపుడు కుక్క నా మీద అలిగింది. నాలుగు రాజకీయ డిమాండ్లతో నాలుగు రోజులు దీక్షకు దిగింది. కారణాలు సహేతుకమే. కానీ నాబాధ అంతా దాని దీక్ష తీరుమీదే.... ఏమీ ముట్టలేదు. అందరితో నాకు అదే రాయబారం పంపింది. సరే ఎప్పటికన్నా ఉపయోగపడదా అని దాని డిమాండ్లు అంగీకరించా. అదేందో... అది దీక్షకు దిగిన కాడి నుండి బుల్లితెరలు తెగ హైరానా పడ్డాయి. బ్రహ్మాండం బద్దలైనట్లు. చివరికి డిమాండ్లు ఒప్పుకోగానే బుల్లితెరల మైకులముందు గంట నిలబడి నీతులు పలికింది. ఆశ్చర్యం అన్ని రోజులు దీక్ష చేసినా ఆరోగ్యం బ్రహ్మాండం. మా కుక్క రఘు నికార్సైనది.
Sunday, 20 March 2011
Saturday, 19 March 2011
జొన్నవిత్తులా...!
ఎప్పుడు తెలుస్తుందిరా మీకు?
బతుకంటే బిజినెస్ కాదని..
బతుకంటే పోరాటమని..
పోరాటమంటే మెతుకు కోసం ఆరాటమనీ...
జీవితాలు కాలిపోతుంటే దిక్కులేదు గానీ..
విగ్రహాలు కూలిపోతే అంత మంటా నీకు...
బతుకులు మంటల్లో కలిసిపోతుంటే బాధలేదు..
మెతుకులు లేక అవస్థ పడుతుంటే జాలి లేదు..
విగ్రహాలు పోయాయని విలవిల్లాడుతున్నావే...
వెయ్యి బొమ్మలు మళ్లీ నిలబెడతా..
పోయిన ఒక్క ప్రాణం తీసుకురా...
పైత్యపు కవిత్వం కాదురా పోరాటమంటే..
సత్యం కోసం జరిగేదేరా పోరాటం
ఇప్పుడే స్పష్టత వచ్చింది....!
ఇప్పుడు స్పష్టత వచ్చింది
ఎవరి వారు ఎవరో
ఇన్నాళ్లూ దొంగచాటుగా ఉన్నారు
నేడు
వారి స్వబుల్లి తెరలపై నృత్యం చేస్తున్నారు
అడుగడుగునా పోలీస్ పహారాను ప్రశ్నించనివాడు
గురివిందల అరవిందలై
ఇంకెంతకాలం వలెవేస్తారు
శ్రీరంగపు నీతులు
ఇన్నాళ్లూ మనందరి వారన్నారు
నేడు మావారంటున్నారు
నీ పాట, నాపాట
నీ బాష, నా యాస
నీ పద్యం, నా గద్యం
మొత్తంగా నీ, నా స్మృతులు వేరైనప్పుడు
నా వైతాళికులకు లేనిచోటు
నీ వారికే ఉంటే
నా హృదయం ద్రవించదా?
ఇక....
నీ నాటకం బయటపడింది
అరవై వసంతాల ఆక్రోషం
ఆరువందల ఆత్మబలిదానాలకు
వేదనతో గాయపడ్డ మా మనుసులకు
గైవించని చోట
మమ్ములను విధ్వంసం చేసిన చోట
నిన్నెలా భుజాన ఎత్తుకోను?
కూల్చిన రాతి బొమ్మలకే
ఎందుకంత రాద్ధాంతం
మా పిల్లల భవిష్యత్తును నేలరాల్చిన
మీ పరాయి పాలనపై
పెదవి విప్పరేమి
ఇప్పుడే నిజాలు బయటపడ్డాయి
మాకూ
స్పష్టత వచ్చింది
ఎవరివారు ఎవరో
ఇక ధూం ధామే....
Subscribe to:
Posts (Atom)